By: Oneindia Telugu Video Team
Published : January 27, 2018, 01:28

ఐపీఎల్‌ వేలం : యువరాజ్‌ సింగ్‌, గౌతం గంభీర్‌ రూ 2 కోట్లే నా ?

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం నిర్వహిస్తోన్న వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఆటగాడి కోసం ఎంత ధర వెచ్చించాలో అనే పక్కా ప్రణాళికతో వచ్చిన ఫ్రాంఛైజీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌ను హైదరాబాద్‌ వదిలేసింది.
ఢిల్లీకి డేరింగ్ హీరోస్:కనీస ధర రూ.2కోట్లతో యువీని పంజాబ్‌ దక్కించుకుంది. ప్లేయర్‌ రిటెన్షన్‌లో గౌతం గంభీర్‌ను అట్టిపెట్టుకోకపోవడంతో కోల్‌కతా అతడ్ని వదిలేస్తుందనే వార్తలొచ్చాయి. అదే నిజం చేస్తూ ఈ రోజు వేలంలో కోల్‌కతా అతడి కోసం ఆర్‌టీఎం వాడలేదు. దీంతో రూ.2.8కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గంభీర్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌, ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి కనబరచడం గమనార్హం. మ్యాక్స్‌వెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, స్టోక్స్‌, మిచెల్‌ స్టార్క్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. గత ఏడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్‌ కోసం ఢిల్లీ vs హైదరాబాద్‌ అనే రీతిలో పోటీ పడ్డాయి. రూ.9కోట్ల వద్ద హైదరాబాద్ వేలం నుంచి తప్పుకుంది. అలాగే రైట్‌ టు మ్యాచ్‌ కార్డును పంజాబ్‌ మ్యాక్స్‌వెల్‌ కోసం ఉపయోగించలేదు. దీంతో రూ.9కోట్లకు దిల్లీ డేర్‌డెవిల్స్‌ అతన్ని సొంతం చేసుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా