By : Oneindia Telugu Video Team
Published : May 19, 2017, 05:34

జగన్ కోసం డబల్ గేమ్ ఆడుతున్న bjp మరి tdp?

వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓటమి చెందుతారు.. అనే విషయాన్ని పక్కన పెడితే.... అప్పుడు ఎవరి రాజకీయాలు వారు చేసేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలు అంటే ఒకరిపై మరొకరు విమర్శలు ఆరోపణలు చేసుకోవడం కామనే. కానీ రెండు పార్టీలు మాటల తూటాలు సంధించుకుంటుంటే... మరో జాతీయ పార్టీ గోడమీద పిల్లిలా వ్యవహరించడమే ఇప్పుడు చర్చించుకోదగ్గ అంశం. ఇందుకు నిదర్శనమే బీజేపీ పనితీరు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అవకాశం కోసం ఎదురుచూస్తుందో... అవకాశం వెతుక్కుంటుందో కూడా అర్ధం కాని పరిస్థితి. కానీ డుబుల్‌ గేమ్‌ ఆడుతుందనేది మాత్రం కొందరు రాజకీయ నిపుణుల అభిప్రాయం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా