By: Oneindia Telugu Video Team
Published : November 03, 2017, 11:11

చంద్రబాబురమణ రహస్యాలను నాయిని వినేసినట్టున్నారు : ఇప్పుడెలా?

Subscribe to Oneindia Telugu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుకుంటున్న మాటలు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వినేశారా? ఈ ఫొటో చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.. కానీ అసలేం జరిగిందంటే.. ఏపీ సీఎం చంద్రబాబు చాలా రోజుల తర్వాత గురువారం హైదరాబాద్ వచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ కార్యకలాపాలపై కీలక నేతలతో ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
అయితే ఈ సమావేశం కంటే ముందే గవర్నర్ నరసింహన్ పిలుపు మేరకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి మరణించి నేటితో 13 రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం 'శుభ స్వీకారం' కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఏపీ, తెలంగాణ, చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, రమణ్ సింగ్‌తో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్, మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యనేతలందరూ పాల్గొని నివాళులర్పించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా