By: Oneindia Telugu Video Team
Published : May 20, 2017, 04:33

తెలంగాణ లో ఆ పార్టీ తో బీజేపీ పొత్తు సాధ్యమా..?

Subscribe to Oneindia Telugu


2019 ఎన్నికల్లో పార్టీల వ్యూహం ఎలా ఉండబోతుంది..? ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే... బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల వల్ల సాధ్యమేనా..? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక మిగిలింది టీడీపీ, బీజేపీలు మాత్రమే. అయితే బీజేపీ కూడా ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా చాటుకోవాలని కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే అమిత్‌షా పర్యటనలు, నితిన్‌గడ్కరీ ప్రసంగాలు వినిపిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు స్కెచ్‌ గీసుకుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో టీడీపీ బీజేపీ మధ్య సయోధ్య కుదురుతుందా..? 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తుపెట్టుకుంటుందా..? అనే ప్రశ్నలే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ఇది జరగడం సాధ్యం కాదనేది కొందరి రాజకీయ నిపుణుల అభిప్రాయం. టీడీపీ బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా... బీజేపీ మాత్రం ససేమిరా అనేందుకే సిద్దపడుతుందని తెలుస్తుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా