By: Oneindia Telugu Video Team
Published : December 18, 2017, 05:29

యువత కాంగ్రెస్ కు పట్టం కట్టిందా ?

Subscribe to Oneindia Telugu

భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టగా తీసుకుని విస్తృత ప్రచారం చేశాయి. మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆరాటపడగా, ఎలాగైనా విజయఢంకా మోగించాలని కాంగ్రెస్ తీవ్ర పోరాటమే చేసింది. ఇందుకు సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలిచాయి.
బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓబీసీ యువనేతలైన జిగ్నేశ్ మేవానీ, అల్పేష్ ఠాకూర్‌లను ఉపయోగించుకుంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నమే చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున వారిద్దరూ గుజరాత్ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ఇద్దరు యువ నేతల వల్లే కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన స్థానాల్లో మరిన్ని స్థానాలు చేరాయని చెప్పడం సందేహం లేదు. మరోపక్క
గుజరాత్ ప్రస్తుత సీఎం విజయ్ రూపానీపై కాంగ్రెస్ పార్టీ ఇంద్రనీల్ రాజ్‌గురును బరిలోకి దింపింది.
విజయ్ రూపానీని ఓడించాలనే లక్ష్యంగానే రాజ్‌కోట్ వెస్ట్ నుండి రాజ్ గురు బరిలోకి దిగారు. అయితే ఈ పోరులో BJP గెలిచినా.. కాంగ్రెస్ తరపున ఇంద్రనీల్ ఇచ్చిన పోటీకి విజయ్ రూపాని చుక్కలు చూసారు. ఆ రేంజ్ లో ఇంద్రనీల్ గట్టి పోటీనిచ్చి ప్రచారం చేసారు. అయితే ఈ పోటిలో యువతను ఆకర్షించే విధంగా కొన్ని కార్యక్రమాలను ప్రచార సమయం లో నిర్వహించారు. యువత నుంచి వచ్చే కొత్త వోటర్ లపై దృష్టి పెట్టారు. బిజెపికి మద్దతుగా ఉన్న సంప్రదాయ ఓట్లను కొల్లగొట్టేలా ప్రచారాన్ని నిర్వహించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా