By : Oneindia Telugu Video Team
Published : June 05, 2017, 01:21

ఐటీ జోరు తగ్గింది... ఫ్యూచర్ వున్న జాబ్స్ ఇవే

ఒకప్పుడు జాబ్ అంటే ఐటీ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ రాను రాను ఐటీ జోరు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించిన ఐటీ.. ఇప్పుడు ఉన్న ఉద్యోగులనే తొలగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. 2013నాటికి దాదాపు 33లక్షల మందికి ఉపాధి కల్పించిన ఐటీ.. గడిచిన మూడేళ్లలో 10లక్షల మందికి మాత్రమే ఉపాధిని అందించింది. 2022నాటికి సైతం 10లక్షల ఉద్యోగాలే సాధ్యమని అసోచామ్(అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా) తెలిపింది. థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థతో కలిసి అసోచామ్ ఈ సర్వే చేసింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా