By: Oneindia Telugu Video Team
Published : November 28, 2017, 09:58

ఇవాంకా వచ్చేసింది ! వీడియో

Subscribe to Oneindia Telugu

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అమెరికాప్రతినిధులు, డెలిగేట్ల బృందంతో కలిసి ఎయిర్ పోర్టులో ఆమె అడుగుపెట్టారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. నలుపు రంగు దుస్తుల్లో కనిపించిన ఇవాంకా.. అక్కడి నుంచి నేరుగా ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు, అధికారులు, ఇవాంకాకు అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్‌కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. ట్రైడెంట్‌లో బస చేస్తారు.
మంగళవారం తెల్లవారుజామున 3గం. నుంచి బుధవారం రాత్రి 9.20 గంటల వరకు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన కొనసాగుతుంది. సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో 40గం. రిజర్వ్‌ టైమ్‌గానే కేటాయించడం గమనార్హం. మంగళవారం మధ్యాహ్నాం 2.50గం. వరకు ఇవాంకా హోటల్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సమయాన్ని 'రిజర్వ్' టైమ్ కేటగిరిలోనే పేర్కొన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా