By: Oneindia Telugu Video Team
Published : November 30, 2017, 11:42

గోల్కొండలో చప్పట్లు కొట్టిన ఇవాంక !

Subscribe to Oneindia Telugu


అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గోల్కొండ కోటలాంటిది లేదని వ్యాఖ్యానించారు. ఈ కోటను చూసి ఆమె ముగ్ధురాలయ్యారు. గోల్కొండ కోట నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసారు. ఆమె కాలి నడకన గోల్కొండ కోటలో తిరిగారు. ఇద్దరు గైడ్‌లు ఆమెకు గోల్గొండ కోట చరిత్ర గురించి చెప్పారు. పలుచోట్ల తిరిగి ఆమె వారి నుంచి విషయాలు తెలుసుకున్నారు. వాటిని ఆసక్తిగా విన్నారు. ఇవాంకా చారిత్రక కట్టడాలను వీక్షించేందు కోసం ప్రభుత్వం బ్యాటరీ కార్లను ఏర్పాటు చేసింది. కానీ ఆమె నడుచుకుంటూనే కోట చారిత్రక విషయాలను తెలుసుకున్నారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కాసేపు చిన్నపిల్ల అయిపోయారు. బుధవారం గోల్కొండ కోటను సందర్శించిన ఆమె ముగ్ధురాలయ్యారు. ఈ సందర్భంగా కోటలోని రాజప్రసాదంలో రాజు.. సేవకులు, సందర్శకులను పిలిచే విధానాన్ని వివరించినప్పుడు ఇవాంకా ఆశ్చర్యపోయారు. అక్కడ నిలబడి చప్పట్లు చరిచి ముచ్చటపడ్డారు.
అనంతరం కోట మధ్యలో నిలబడి గట్టిగా శబ్దం చేస్తే అది ప్రతిధ్వనించి తిరిగి మనకే చేరుతుందని తెలిపినప్పుడు.. ఇవాంకా అబ్బురంగా చూశారు. అద్భుతం.. అంటూ ఒక్క మాటలో గోల్కొండ కోట గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ దేశంలో ఇలాంటిది లేదని కూడా వ్యాఖ్యానించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా