By : Oneindia Telugu Video Team
Published : November 23, 2017, 06:14

గోల్కొండకు నో ఎంట్రీ, బార్లు బంద్!

భాగ్యనగరంలో మూడ్రోజులపాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్(జీఈఎస్) జరగనున్న నేపథ్యంలో మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు
ఈ నెల 28, 29, 30 తేదీల్లో హెచ్‌ఐసీసీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1600 మంది ప్రతినిధులు రానుండడంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఈ నెల 29వ తేదీన గోల్కొండ కోటకు 1,500 మంది విదేశీ ప్రతినిధులు బృందం రానుంది. వీరికి ప్రభుత్వం గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గోల్కొండ కోటలో వారం రోజులు ముందునుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కోటను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతినిధి బృందానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా గోల్కొండ కోటలో మూడు రోజులు పాటు పర్యాటకులను ఎవరినీ అనుమతించడం లేదు. గోల్కొండ కోట నుంచి చుట్టూ రెండు కిలోమీటర్ల మేర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కోట ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్‌, ఇంటలిజెన్స్‌, డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా