By: Oneindia Telugu Video Team
Published : November 28, 2017, 10:00

కౌంట్ డౌన్ స్టార్ట్: హైదరాబాద్‌ లో హై అలర్ట్

Subscribe to Oneindia Telugu

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) 2017 నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో మంగళవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ పర్యటనతో పోలీసులు భారీ భద్రతతో పాటు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసులను కేటాయించారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సుకు భద్రత విషయాన్ని పోలీసు యంత్రంగం ఒక సవాలుగా తీసుకుంది.మియాపూర్‌, కూకట్‌పల్లి, ఫలక్‌‌నుమా, చంద్రాయణగుట్ట, ఆరాంఘడ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే ఆయా మార్గాల్లో వెళ్లే బస్సులను వేరే మార్గాల్లో మళ్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మియాపూర్‌తో పాటు కూకట్‌పల్లిలోని పలు విద్యా సంస్థలు మంగళవారం తమ విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించాయి. వెస్టిన్‌ హోటల్, హెచ్‌ఐసీసీ, తాజ్‌ ఫలక్‌నుమా చుట్టుపక్కల ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు విధించలేదు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్ళే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన ఘట్టాలు కావడంతో అనుకోని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొననున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ సదస్సు నిర్వహణ, అతిథుల బస, భోజనాలు, ట్రాన్స్ పోర్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఫలక్‌నుమా, గోల్కండ కోట విందు ఖర్చులు అదనం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా