By : Oneindia Telugu Video Team
Published : May 04, 2017, 01:45

బాబు తో మైండ్ గేమ్ ఆడుతున్న జగన్..!

అమరావతిలో జగన్‌ చేపట్టిన రెండు రోజుల దీక్షకు మంచి స్పందనే వచ్చింది. భారీ జనసమీకరణ విషయంలోనూ వైసీసీ నేతలు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. అయితే జగన్‌ వ్యూహాత్మకంగానే అడుగులు వేశారా..? ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఇరుకున పెట్టడంలో సక్సెస్‌ అయ్యారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ దీక్షతో జగన్‌పార్టీకి ఏ విధమైన ప్రయోజనాలు చేకూరతాయనే విషయాన్ని పక్కన పెడితే... చంద్రబాబుపై ఎదురుదాడి చేయడంలో మాత్రం జగన్‌ సక్సెస్‌అయ్యారనేది స్పష్టమవుతుంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా