• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 06, 2018, 04:17
    Duration : 04:22

    జగన్ పాదయాత్ర @50 : హామీల వెల్లువ

    2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన జగన్ పాదయాత్రకు 2018 జనవరి 2వ తేదీ నాటికి 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే ఆయన దాదాపు 650 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు....ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ మొత్తం 13 జిల్లాల్లో 180 రోజులు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని.. ఈ క్రమంలో సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకోవాలని జగన్ పాదయాత్ర ప్రణాళిక.
    వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. సిఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జగన్ పాదయాత్ర కొనసాగుతున్నతరుణంలో ప్రజాసంకల్ప యాత్ర 50వ రోజుకు చేరుకోవడం విశేషం. ఇక పాదయాత్ర బహిరంగ సభల్లో జగన్ టిడిపిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర తో ప్రజలతో మమేకమవుతూ వాళ్ల కస్టాలు తెలుసుకుంటూ, హామీలు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జగన్ పాదయాత్ర సాగుతుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా