By: Oneindia Telugu Video Team
Published : December 27, 2017, 03:46

జైరామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం, వీడియో !

Subscribe to Oneindia Telugu


హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర నూతన సీఎంగా జైరామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. ఠాకూర్‌చే ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ ప్రమాణస్వీకారం చేయించారు. సిమ్లాలోని ప్రఖ్యాత రిడ్జ్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం ఉదయం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిడ్జ్ మైదానంలో ఏర్పాటు చేసిన మోడీ, అమిత్ షా, జైరామ్ ఠాకూర్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సెరాజ్ నియోజకవర్గం నుంచి ఠాకూర్ గెలుపొందారు. ఈయన గతంలో కూడా మంత్రిగా పని చేశారు. 1998లో తొలిసారిగా జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలున్న హిమాచల్‌లో బీజేపీ 44 స్థానాలను గెలిచి తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలుత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రిడ్జ్ మైదానంలో నిర్వహించాలనే నిర్ణయంపై వివాదాలు తలెత్తాయి. పర్యావరణం పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే అన్ని వివాదాలకు తెరపడి చివరికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇదే మైదానం వేదికగా మారింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా