• search
By : Oneindia Telugu Video Team
Published : May 23, 2018, 10:24
Duration : 02:10

2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: పవన్


2014లో జనసేన వల్లే ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలను పరిష్కరించలేనందున ప్రజల తరుపున ప్రశ్నించేందుకే తాను ప్రజలతో కలిసి తిరుగుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గలో ప్రత్యేక హోదా కవాతులో మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టిడిపిపై వపన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.
2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి జనసేన పార్టీయే కారణమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమీలను విస్మరించాయని ఆయన విమర్శించారు. చట్టసభల్లో కూర్చొన్న నేతలు తమ ప్రయోజనాలను కాపాడుకొంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రభుత్వాలు మాట నిలుపుకోలేదన్నారు. ఈ మాటను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.
2019 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడమే కాకుండా ఎన్నికల్లో ప్రతి ఒక్కరితో జనసేనకు ఓటు చేయిస్తే తాను సీఎం అవుతానని చెప్పారు. 2019 లో ఏపీ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. అయితే జనసైనికులు గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.బిజెపిని నిలదీసిన చరిత్ర తమదేనన్నారు. చంద్రబాబునాయుడు బిజెపిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more