By : Oneindia Telugu Video Team
Published : April 04, 2018, 06:40

లంచాలు తీసుకొని రసీదులు ఇవ్వరుగా : పవన్ కళ్యాణ్

విజయవాడలోని జనసేన కార్యాలయంలో సీపీఎం, సీపీఐ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యమ కార్యాచరణపై సీపీఎం రామకృష్ణ, సీపీఐ మధు తదితరులు జనసేనానికి వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
హోదా కోసం ఏప్రిల్ 6న రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రతో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ అవిశ్వాసంపై మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కూడబలుక్కొని అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేస్తున్నాయని ఆరోపించారు. త్వరలో తాను అనంతపురం, ఒంగోలు, ప్రకాశం జిల్లా మేధావులతో మాట్లాడుతానని చెప్పారు.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చాలా ఆలస్యమైందని పవన్ చెప్పారు. గతంలోనే ఆయన ఢిల్లీకి వెళ్తే బాగుండునని తెలిపారు.చాలా సంవత్సరాల క్రితమే వెళ్లవలసి ఉండెనని అభిప్రాయపడ్డారు. హోదా కోసం చేపడతానన్న ఆమరణ దీక్షపై మాట్లాడుతూ.. దీక్షపై సమయం తనకు వదిలేయాలన్నారు. మంత్రి లోకేష్, టీడీపీ నేతలపై ఆరోపణల గురించి స్పందిస్తూ.. జనం అనుకున్నది తాను చెప్పానని, లంచాలు తీసుకొని రసీదులు ఇవ్వరుగా అని కౌంటర్ ఇచ్చారు. దానికి టీడీపీ నేతలు స్పందిస్తూ..అన్నింటికి కాగితాలు ఉన్నాయని, అవినీతి జరగలేదని చెప్పారు. దానికి కౌంటర్‌గా పవన్ లంచాలు తీసుకున్నప్పుడు అవినీతి ఇవ్వరని గట్టి కౌంటర్ ఇచ్చారు.
సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ... ఏపీ అంటే అమరావతి, పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాదని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. అంతా ఒకేచోట అభివృద్ధి జరుగుతోందని ఆరోపించారు. దీంతో వెనుకబడిన జిల్లాలు ఆందోళనలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ నమ్మకద్రోహానికి నిరసనగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా