కోహ్లీ ఆ రోజే చెప్పాడు.. కెప్టెన్ గా నేను రెడీ..!
Published : January 18, 2022, 04:30
టెస్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పి షాకింగ్ నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు టెస్టు బాధ్యతలు తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, ఎవరు ఉహించని విధంగా జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా తెరమీదకొచ్చింది. దీనికి ప్రధాన కారణం సౌతాఫ్రికా వన్డే సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడమే..! ఈ సిరీస్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ కెప్టెన్సీపై ఆసక్తికర సమాధానం చెప్పాడు.