By: Oneindia Telugu Video Team
Published : February 17, 2017, 05:46

జయ లలిత ఆస్తులు ఎంత....?

Subscribe to Oneindia Telugu

ఇక జయలలిత ఆస్థుల లెక్కల విషయానికి వస్తే.... అధికారిక లెక్కల ప్రకారం... రూ.117.13 కోట్లు. వాటిల్లో పోయెస్ గార్డెన్ లోని జ‌య‌ల‌లితకి నివాస గృహం వేద విలాస్ ఉంది. 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భ‌వ‌నం రూ.43.96 కోట్ల విలువ చేస్తుంది. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో కొనుగోలు చేయగా అప్పట్లో దాని విలువ రూ.1.32 లక్షలు. అంతేకాదు జ‌య‌ల‌లిత‌కు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాల భూమి ఉంది. తమిళనాడులోని కాంచీపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. జయలలితకు ఉన్న నాలుగు వాణిజ్య భవనాల్లో ఒకటి హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఉంది. అంతేకాదు జ‌య‌ల‌లిత‌కు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఎక్కువ శాతం కార్లకే ఖర్చు చేసేవారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా