By: Oneindia Telugu Video Team
Published : December 05, 2017, 05:18

జయలలిత కుమార్తె అంటున్న అమృత మిస్సింగ్ !

Subscribe to Oneindia Telugu


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శోభన్ బాబుల కుమార్తె నేనే అంటూ హైకోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్న బెంగళూరు మహిళ అమృత (37) విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అమృత విషయంలో చూసిచూడనట్లు ఉంటే ఈ వ్యవహారం చాలా వరకు వెళ్లే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
దేశ విదేశాల్లో లక్షల మంది అభిమానులు ఉన్న జయలలితకు వివాహం కాకపోయినా తానే ఆమె కుమార్తె అంటూ అమృత ప్రచారం చేసుకుంటున్నారని పలువురు అన్నాడీఎంకే పార్టీ నాయకులు మండిపడుతున్నారు. జయలలిత కుమార్తె అంటూ అమృత తెరమీదకు రావడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అలనాటి ప్రముఖ నటుడు శోభన్ బాబులకు తాను జన్మించానని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల బెంగళూరుకు చెందిన అమృత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అమృత తనకు కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ఫోన్లు చేసి చంపేస్తామని బెదరిస్తున్నారని ఆరోపించారు. తరువాత అమృత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమృత బెంగళూరులో ఉన్నారా ? లేదా ? అనే విషయం కచ్చితంగా తెలియడం లేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా