By: Oneindia Telugu Video Team
Published : November 27, 2017, 01:57

బాబు మాకు పదవులివ్వరు! జగన్ మా వాడే

Subscribe to Oneindia Telugu

జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్య్యూలో మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనంగా మారారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు గానీ, తన సోదరుడి(జేసీ ప్రభాకర్ రెడ్డి)కి గానీ మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావించడం లేదని, ఆ విషయం తనకు స్పష్టంగా తెలుసునని జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ అన్నదమ్ములను ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటారేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. కేంద్రంలో తనకుగానీ, రాష్ట్రంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డికిగానీ మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని జేసీ అన్నారు. తమను కూరలో వాడుకుని, ఆపై పక్కన పడేసే కరివేపాకులా చూస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం రాజకీయాలు కలుషితం అయ్యాయని, ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచిన తాను ప్రస్తుత పరిస్థితి చూసి చలించి పోతున్నానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందరూ అవినీతి పరులేనని, తాను మాత్రం అవినీతికి దూరమని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కమిషన్లకు ఎన్నడూ కక్కుర్తి పడలేదని స్పష్టం చేశారు. తానెన్నడూ హత్యలు చేయలేదని, చేయించలేదని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను దూరమని అన్నారు.అభివృద్ధికి దూరంగా ఉన్న అనంతపురం నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంలో ఓ ఎంపీగా తాను విఫలం అయ్యానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తాను ఎంపీగా కొనసాగడం భావ్యమా? అని సందేహం కలుగుతోందని అన్నారు. తన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా