By : Oneindia Telugu Video Team
Published : October 30, 2017, 07:25

జెట్ ఎయిర్ వేస్ విమానానికి బెదిరింపులు

ఢిల్లీకి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని భద్రతా కారణాల వల్ల సోమవారం ముంబై నుండి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. 9W339 విమానం ఆదివారం దాటిన తర్వాత సోమవారం అర్ధరాత్రి గం.2.55 నిమిషాలకు ముంబైలో టేకాఫ్ తీసుకుంది. అనంతరం అహ్మదాబాదులో గం.3.45 నిమిషాలకు ల్యాండ్ అయింది
భద్రతా కారణాల వల్ల విమానాన్ని మళ్లించినట్లు ప్రయాణీకులు చెప్పారని తెలుస్తోంది. కాగా, వాష్‌రూంలో ఎయిర్ హోస్టెస్ ఓ బెదిరింపు లేఖను గుర్తించారు. విమానంలో హైజాకర్స్, పేలుడు పదార్థాలు ఉన్నాయని లేఖలో ఉండటంతో మళ్లించారని తెలుస్తోంది..
విమానంలో హైజాకర్లు ఉన్నారు. మొత్తం 12 మంది ఉన్నారు. విమానాన్ని దిల్లీలో ల్యాండ్‌ చెయ్యొద్దు. నేరుగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు తీసుకెళ్లండి. అయినా ల్యాండ్‌ చేశారో ప్రయాణికులు చనిపోతున్న శబ్దాలు వింటారు. ఇది జోక్‌ కాదు. కార్గో ఏరియాలో పేలుడు పదార్థాలున్నాయి’ అని లేఖలో ఉంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా