By : Oneindia Telugu Video Team
Published : April 03, 2018, 06:51

ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఎన్టీఆర్..తన ఫేవరేట్ ఆయనే..?


తన ఫేవరేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పుకొచ్చారు జూ. ఎన్టీఆర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌కు గాను తెలుగులో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో స్టార్ మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ 'ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో స్టార్ మాతో అసోసియేషన్ పట్ల సంతోషంగా ఉన్నా. దీనిని ఒక కుటుంబం లాగా భావిస్తున్నా. ఐపీఎల్ తెలుగు రీచ్ అవుతుందని, అసలు మజా తెలుగులోనే ఉంటుంది' అని అన్నారు.
మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు అన్న ప్రశ్నకు గాను 'చాలా మంది గొప్ప క్రికెటర్లు ఉన్నారని, వారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. తనకు క్రికెట్ గురించి అవగాహన వస్తోన్న వయసులో సచిన్ టెండూల్కర్ మాత్రమే తెలుసని, ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇష్టం. అయితే సచిన్ ఎప్పటికీ సచినే' అని అన్నారు.
క్రికెట్లో ఐపీఎల్ ఒక కొత్త డైమన్షన్‌ని క్రియేట్ చేసింది. అలాంటి ఒక కొత్త డైమన్షన్‌కి తెలుగుభాషలో దాని కామెంట్రీ చేస్తే, స్టార్ మా మూవీస్‌లో దాన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకున్నందుకు నిజంగా స్టార్ ఇండియా వారికి నా కృతజ్ఞతలు. నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా