By : Oneindia Telugu Video Team
Published : April 13, 2018, 01:24

8 ఏళ్ల చిన్నారిపై హిందూ దేవాలయంలో గ్యాంగ్ రేప్...!

ఉత్తరప్రదేశ్‌లో మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే గ్యాంగ్ రేప్.. కశ్మీర్ లోని ఓ హిందూ దేవాలయంలో 8మంది ప్రభుత్వ అధికారులు 8ఏళ్ల చిన్నారిపై రోజుల తరబడి గ్యాంగ్ రేప్.. ఇటీవలి కాలంలో దేశాన్ని అత్యంతగా కుదిపేసిన సంఘటనలు ఈ రెండు. రెండు కేసుల్లోనూ పోలీసుల నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపించిందన్న ఆరోపణలున్నాయి. బాధితుల తరుపున కాకుండా నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఈ రెండు ఘటనలపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా కశ్మీర్ బాలిక ఆసిఫా పట్ల పాశవికంగా వ్యవహరించిన తీరు మరో 'నిర్భయ' ఘటనను తలపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నిర్భయను రేప్ చేసినవారిలో అంతగా చదువుకోనివారే ఎక్కువ కాగా.. తాజా ఘటనలో అందరూ ప్రభుత్వ అధికారులు, పెద్దవారే ఉండటం గమనార్హం. గుర్రాలను మేపుతున్న సందర్భంలో బాలికను కిడ్నాప్ చేసి.. ఓ గుడిలో ఆమెను బంధించి.. డ్రగ్స్ ఇచ్చి.. ఎనిమిది మంది ఆమెపై రోజుల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమెపై అత్యాచారం చేసినన్ని రోజులు ఆమెకు తిండి కూడా పెట్టలేదు. ఆఖరికి ఆమె కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ.. మరోసారి రేప్ చేసి మరీ బండరాయితో మోది ఆమెను హత్య చేశారు. ఆసిఫా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన బాలిక కావడంతో.. మత విద్వేషం కోణంలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న నిర్భయ ఘటన గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై మహిళా భద్రత గురించి హామి ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా