By : Oneindia Telugu Video Team
Published : March 19, 2018, 12:16

పవన్ పై విరుచుపడుతున్న నేతలు..!

విళంబి నామ సంవత్సరం కొత్తగా ఉన్నట్లే రాజకీయాలు కూడా విచిత్రంగా ఉంటాయని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న గొప్పన నేత అన్నారు. టీడీపీ అవిశ్వాసానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోందన్నారు. చంద్రబాబును అణగదొక్కాలని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌పై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా విమర్శలు గుప్పించారు.
పవన్ అజ్ఞాతవాసి అని కేఈ నిప్పులు చెరిగారు. ఆయన అజ్ఞాతం వీడి, ఇప్పుడు వెంటనే అజ్ఞానంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే గంటలో 16 పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని తిరస్కరించి రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు ప్రజలు చంద్రబాబును ఆదరిస్తారని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో చంద్రబాబు నాయుడే తనకు పోటీ అని భావించిన మోడీ ఏపీపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.
గుజరాత్‌ను ఏపీ మించిపోతుందేమోనని మోడీ భావిస్తున్నారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. తమిళనాడులో పట్టులేకున్నా కల్పించుకొని అక్కడ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఏపీలోను అలాంటి రాజకీయాలు కుదరవన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా