By : Oneindia Telugu Video Team
Published : July 25, 2017, 05:58

డ్రగ్స్ తో కాజల్ ,రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు సంబంధం? టెన్షన్ టెన్షన్

డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ సిట్ విచారణతో ఇప్పటికే టాలీవుడ్ వణికిపోతోంది. నిన్న కాజల్ మేనేజర్ రోనీ అలియాస్ రాన్ సన్ జోసెఫ్ ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా రోనీ మేనేజర్ గా వ్యవహరించాడు.రోనీని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, టాలీవుడ్ మరోసారి షాక్ కు గురైంది. ముగ్గురు హీరోయిన్లతో మేనేజర్ గా ఆయనకు సంబంధాలు ఉండటంతో, ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు, రోనీని విచారిస్తే, డ్రగ్స్ వ్యవహారంలో మరిన్ని కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా