By : Oneindia Telugu Video Team
Published : April 09, 2018, 04:35

బళ్లారి లో మినహా అన్ని చోట్ల అభ్యర్దుల జాబితా సిద్దం

కర్ణాటక శాసన సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఒక అడుగు ముందుకువేసింది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్దం చేసిన బీజేపీ అధిష్టానం మొదటి జాబితాను విడుదల చేసింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 12వ తేదీన జరగనున్నాయి.ఈ నేపథ్యంలో జేడీఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది.ఇప్పటికే జేడీఎస్ 126 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచారం ముమ్మరం చేసింది. కర్ణాటకలో 224 శాసన సభ స్థానాలలో జేడీఎస్ 20 సీట్లను బీఎస్పీకి కేటాయించింది.
బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా ఉన్న అభ్యర్థులను ఎంపిక చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఉత్తర కర్ణాటకతో పాటు దక్షిణ కర్ణాటకలో 72 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జేపీ. నడ్డా విడుదల చేశారు.
బెంగళూరులోని యలహంకలో- ఎస్ఆర్. విశ్వనాథ్, రాజరాజేశ్వరీ నగర- పీఎం. మునిరాజు గౌడ, దాసరహళ్ళి- ఎస్ మునిరాజు, మల్లేశ్వరం- డాక్టర్ సీఎస్, అశ్వథ్ నారాయణ, హెబ్బాళ- డాక్టర్ వైఏ, నారాయణస్వామి, సీవీ రామన్ నగర- ఎస్. రఘ, రాజాజీనగర- సురేష్ కుమార్, గోవిందరాజనగర- వీ. సోమణ్ణ, చిక్కపేట-ఉదయ గరుడాచార్, బసవణగుడి- రవి సుబ్రమణ్య, పద్మనాభనగర- ఆర్. అశోక్, జయనగర- బీఎన్. విజయ్ కుమార్, మహదేవపుర- అరవింద లింబావలి, బోమ్మనహళ్ళి- సతీష్ రెడ్డి, బెంగళూరు దక్షిణ ఎం. కృష్ణప్ప, ఆనేకల్- ఏ. నారాయణస్వామిని బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. మిగిలిన నియోజక వర్గాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించలేదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా