By : Oneindia Telugu Video Team
Published : April 10, 2018, 06:24

బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఎస్ఎం. కృష్ణ

కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్బంగా బీజేపీకి భారీ ఎదురుదెబ్బపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, ఒక్కలిగులలో ఎంతో ప్రభావం ఉన్న నాయకుడు ఎస్ఎం. కృష్ణ బీజేపీకి రాంరాం చెప్పి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్దం అవుతున్నారని వెలుగు చూసింది.
ఎస్ఎం. కృష్ణ దాదాపు ఐదు సంవత్సరాల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎస్ఎం. కృష్ణ సీఎంగా ఉన్న సమయంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఎంతో అభివృద్ది చెంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేసిన అనుభవం ఎస్ఎం. కృష్ణకు ఉంది.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఎస్ఎం. కృష్ణకు పలుకుబడి తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన తనను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందిన ఎస్ఎం. కృష్ణ ఆ పార్టీ నుంచి బయకు వచ్చేశారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎస్ఎం. కృష్ణ 2017 మార్చి నెలలో బీజేపీలో చేరారు. అయితే అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా మండ్య, మైసూరు జిల్లాల్లో బీజేపీ నాయకులు ఎస్ఎం. కృష్ణ ప్రచారాన్ని తూతూమంత్రంగా ఉపయోగించుకున్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక్కసారి కూడా ఎస్ఎం.కృష్ణను కలవలేదు. కనీసం ఎన్నికల ప్రచారానికి ఆయన్ను ఆహ్వానించలేదు.
ఎస్ఎం. కృష్ణ అనుభవం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఉపయోగపడుతోందని ఒక అంచనాకు వచ్చారని సమాచారం. ఈ విషయం రాహుల్ గాంధీ చెవిలో వేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా