• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 16, 2018, 12:08
    Duration : 02:31

    సీఎంగా కుమారస్వామి ది బెస్ట్.. సీఎం సిద్దూకు మూడో స్థానం


    మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో రాజకీయం ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్నది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా? నేనా? అన్నట్లు వాగ్భాణాలు సంధించుకుంటున్నాయి. మరోసారి మెజారిటీ సామాజిక వర్గంగా ఉన్న హిందువులను ఆకట్టుకునే లక్ష్యంతో ఇరుపక్షాలు భావోద్వేగపూరిత వ్యాఖ్యలకు దిగుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ మూడో పక్షం 'సీహెచ్ఎస్' ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రాజకీయ పండితులనే అచ్చెరువొందిస్తున్నది. ఒకనాడు కన్నడ నేలపై మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలో కీలక భూమిక పోషించిన సెక్యులర్ జనతాదళ్ నాయకుడు, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామినే తమ సీఎం అభ్యర్థిగా ఎక్కువగా ఎంచుకుంటున్నారని తేలింది.
    ఇక తదుపరి సీఎం తానేనని అంచనాల్లో ఉన్న మాజీ సీఎం - బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప స్థానంలో ఉన్నారు. సరైన సీఎం అభ్యర్థిగా తదుపరి దశలో ప్రస్తుత సీఎం సిద్దరామయ్యకు కన్నడిగులు మూడో ప్రాథాన్యం ఇస్తున్నారు. ఇక జనతాదళ్ (ఎస్) 65 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.
    అధికార కాంగ్రెస్ పార్టీ 2013తో పోలిస్తే పలు సీట్లు కోల్పోయి 40 - 50 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని తెలుస్తున్నది. కాకపోతే ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిగా దళిత నేతను ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి గణనీయ స్థాయిలో ఓట్లు తెచ్చి పెడతాయని నిర్ధారణ అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని భావిస్తున్న బీజేపీ 73 నుంచి 76 అసెంబ్లీ స్థానాల్లో విజయం లభిస్తుందని సర్వే తేల్చిన సారాంశం.
    సర్వే సారాంశం కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాన్ని ఇవ్వలేదని జేడీఎస్ సీనియర్ నేత హెచ్ డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇక సిద్దరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని సర్వే తేల్చి చెప్పింది. ఒకవేళ సర్వే నిజమైతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాజయంతోపాటు నైతికంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా