By : Oneindia Telugu Video Team
Published : April 05, 2018, 05:39

మోడీకి వార్నింగ్, రజనీ, కమల్ సినిమాలకు బ్రేక్, కన్నడిగ దెబ్బ!

కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు.తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ పిలుపునిచ్చిన బంద్ కు ఊహించని మద్దతురావడంతో కర్ణాటకలో కన్నడ సంఘాలు తెరమీదకు వచ్చాయి. తమిళనాడులో బంద్ నిర్వహించిన వారం తరువాత అదే గురువారం కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకూడదని గురువారం తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరు రోడ్డులోని అత్తిబెలెలో కన్నడ చళవళి వాటళ్ పార్టీ వ్యవస్థాపకుడు వాటళ్ నాగరాజ్ తో పాటు వందలాధి మంది కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
అత్తిబెలెలో మీడియాతో మాట్లాడిన వాటళ్ నాగరాజ్ కేంద్ర ప్రభుత్వం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయితే కన్నడిగులు కన్నెర్రచేస్తారని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యరాదని వాటళ్ నాగరాజ్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకుండా ఒత్తిడి తీసుకురావడానికి ఏప్రిల్ 12వ తేదీ కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చామని వాటల్ నాగరాజ్ అన్నారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించి ఆ రోజు కన్నడిగులు వారి సత్తాచూపిస్తారని వాటళ్ నాగరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు కమల్ సినిమాలు ఇక ముందు కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకుంటామని వాటళ్ నాగరాజ్ హెచ్చరించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా