By : Oneindia Telugu Video Team
Published : April 14, 2018, 01:44

వెలుగులోకి మరిన్ని సంచలనాలు....!

కథువా చిన్నారిపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలిపై అత్యాచారం జరిపిన క్రమంలో.. నిందితులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మరోసారి వెల్లడైంది.
అత్యాచారానికి ముందు నిందితులు బాలికకు 'భంగ్' మాత్రలను బలవంతంగా తినిపించారని కథువా క్రైం బ్రాంచ్ పోలీసులు తేల్చారు. ఆ సమయంలో ఓ యువకుడు బాలిక కాళ్లు గట్టిగా పట్టుకోగా.. మరొకరు ఆమె నోట్లో మూడు భంగ్ మాత్రలను వేసినట్టు తెలిపారు.
బాలికను దేవాలయంలో బంధించిన దుండగులు.. మూడు రోజుల పాటు ఎపిట్రిల్ 0.5 ఎంజీ మత్తు బిళ్లలను మింగించారని చెప్పారు. 'మేం డాక్టర్లతో మాట్లాడినప్పుడు వారు చెప్పారు.. సాధారణంగా పేషెంట్లకు 0.5ఎంజీ డోస్ మాత్రను రోజుకు ఒకటే ఇస్తారని తెలిపారు. కానీ కథువా బాలికకు మాత్రం ఒకేరోజు అలాంటివి 8మాత్రలు మూడు రోజుల పాటు మింగించారు' అని పోలీసులు తెలిపారు.
బాలికను దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బాలిక ఆచూకీ కోసం ఓరోజు ఆమె తల్లిదండ్రులు ఆలయం గేటు వద్దకు రాగా.. వారిని లోపలికి రానివ్వలేదని పోలీసులు తెలిపారు.
అక్కడి వాతావరణం అత్యంత చల్లగా ఉండటంతో బాలిక మృతదేహం మూడు రోజుల పాటు కుళ్లిపోకుండా ఉంది' అని చెప్పారు. ఈ మొత్తం ఘటన వెనుక రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అడవిలో క్రూర జంతువులు, కోతుల భయంతోనే బాలిక మృతదేహాన్ని సాంజీ రామ్ ఇంటికి 100మీ. దూరంలోనే పడేశారని పోలీసులు తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా