Kavitha Hunger Strike : ఫలించిన కవిత పోరాటం.. దిగొచ్చిన రేవంత్ సర్కార్!
ఖమ్మం శివారులో వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వెలుగుమట్లలో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. అవి ప్రభుత్వ భూములు అని చెబుతూ 10 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు నేలమట్టం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో వందలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారిపోయాయి. ఈ క్రమంలో తమ భూములను కాపాడాలని కోరుతూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేది లేదని ఆమె చేపట్టిన దీక్షకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
Video Published On: Wednesday, Mar 11, 2026, 06:27 [IST]


Click it and Unblock the Notifications