By : Oneindia Telugu Video Team
Published : November 24, 2017, 12:22

కేసీఆర్ అందం చూస్తే ఇవాంకా షాక్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ చివరికి ఇవాంకా ట్రంప్ ను కూడా వదిలిపెట్టలేదు. ఆమె హైదరాబాద్‌కు రాకమునుపే వర్మ తన వ్యాఖ్యానం మొదలెట్టేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె రాక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ఇవాంకా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ను అత్యంత సుందరంగా అలకరిస్తున్నారు. అంతేకాదు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. నెల రోజుల కిందటే అమెరికా భద్రతాధికారులు ఇక్కడకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇవాంకా అందాన్ని బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ అందంతో పోల్చుతూ గతంలో వ్యాఖ్యానించిన ఆయన తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఇందులోకి లాగారు. ''ఇవాంకాకు తాను అందంగా ఉంటానన్న అహంకారం ఎక్కువ. అయితే, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఆమె షాక్‌ అవ్వడం ఖాయం. కేసీఆర్, ఇవాంక పక్కపక్కన కూర్చుంటారు కాబట్టి, అప్పుడు ఇవాంకాను ఎవరూ చూడరని బెట్ కాస్తాను..'' అంటూ వర్మ వ్యాఖ్మానించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా