By: Oneindia Telugu Video Team
Published : December 30, 2017, 11:47

కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి వెళ్ళనున్నారా ?

Subscribe to Oneindia Telugu


జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. కోకాపేటలో గొల్ల కురుమ భవనానిక శంకుస్థాపన చేసి ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం తాను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశానని, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదైనా ఉందని తనను ఆయన అడిగారని కేసీఆర్ చెప్పారు. తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని చెప్పినట్లు ఆయన తెలిపారు.

రైతులకు ఎకరానికి 8 వేల రూపాయలు ఇస్తున్న పథకం గురించి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారని, ఆ సొమ్మును రైతులు ఎలా తిరిగి చెల్లిస్తారని అడిగారని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే ఇస్తున్నామని తాను చెప్పానని ఆయన అన్నారు.

రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు ఆర్థికంగా బలపడాలని, ఏ కులంలో పేదలను ఆ కుల సంఘాలు ఆదుకొంటూ ముందుకు కదలాలని, అదే చైతన్యంతో రాజకీయంగా కూడా ముందు కు వచ్చినప్పుడే తాను కలలు గన్న తెలంగాణ సాకారమవుతుందని కేసీఆర్ అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా