By : Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 11:09

నిర్మాణం త్వరగా పూర్తి చేయండి.. కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ ఛైర్మన్ ఐఎస్ జా కలిశారు. న్యూగ్రిడ్ నుంచి దక్షిణాది రాష్ర్టాలకు విద్యుత్ ఇచ్చిపుచ్చుకునేందుకు అనువైన లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ను కోరారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకునేందుకు అవసరమైన వార్ధా-డిచ్‌పల్లి లైన్ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సీఎం కోరారు. మార్చి ఆఖరి వరంగల్-వరోరా లైన్ నిర్మాణం కూడా త్వరగా ప్రారంభించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ట్రాన్స్‌ మిషన్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్దంగా ఉన్నామని పవన్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐ.ఎస్‌.జా స్పష్టం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా