By : Oneindia Telugu Video Team
Published : March 05, 2018, 10:49

థర్డ్ ఫ్రంట్ !! జాతీయ రాజకీయాలు మార్చేస్తారా ?

తాను థర్డ్ ఫ్రంట్ అని ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తనకు దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. తనకు మహారాష్ట్ర నుంచి ఎంపీలు ఫోన్లు చేశారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయలేవని ప్రజలకు అర్థమైందన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఫోన్ చేశారని చెప్పారు. చైనా, సింగపూర్ అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందిందని చెప్పారు. అవసరమైతే ప్రజల కోసం రాజ్యాంగం మార్చాలని చెప్పారు. ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీల్లో మార్పు రావాలని, తమ పంథాను, పద్దతిని మార్చుకోవాలన్నారు.

తాను భారత రాజకీయాలను మార్చేస్తానని కేసీఆర్ చెప్పారు. కేంద్రానికి పరిమిత అధికారాలు ఉంటాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి ఉండాలన్నారు. ప్రసంగం తర్వాత ఆయన జై తెలంగాణ జై భారత్ అన్నారు. ఆయన నినాదం జై తెలంగాణ నుంచి జై భారత్‌కు మారింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా