By : Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 03:22

ఖైదీ నెంబర్‌ 9234

శశికళ జైల్లో ఎలా ఉన్నారో తెలుసా..?
శశికళకు జైలు జీవితం కొత్తేమీ కాదు. గతంలో జయలలితతో పాటు కొన్నాళ్లు జైళ్లో ఉండొచ్చారు. అయితే అప్పుడు ఆమె జైళ్లో అయితే ఉన్నారు గానీ... ఒక ఖైదీలా ఉండలేదు. రాజభోగం అనుభవించారు. అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఉండి జైలుకు వెళ్లడం, అనారోగ్యం కారణంతో .... ఆమెను వీఐపీ సెల్‌లో కూర్చుబెట్టారు. ఆమె వెంటే శశికళను కూడా ఉంచారు. కానీ ఇప్పుడు అంతసీన్‌ శశికళకు ఇవ్వలేదు. బెంగళూరు శివారులోని పరప్పణ అ్రగహారరం జైలు ప్రాంగంణంలో ఆమె మూడున్నరేళ్లు గడపాలి. అదికూ ఒక సాధారణ ఖైదీగా మాత్రమే గడపాలి. ఎలాంటి అధనపు ప్రయోజనాలు కల్పించేందుకు కోర్టు అంగీకరించలేదు. శశికళ మాత్రం తనకు ఇంటి భోజనమే కావాలని, ఆమె ఉండే సెల్‌లో ఏసీ, టీవీ, ఒక పనిమనిషి కావాలని కోర్టును కోరినా... శశికళ అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. ఇక శశికళ ఖైదీ నెంబర్‌ 9234.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా