• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 29, 2017, 01:22
    Duration : 01:42

    అందంతో వల:కోట్లు కాజేసిన కిలాడీ లేడీ లీక్డ్ ఫొటోస్ !


    ప్రేమ, పెళ్లి పేరుతో ఎంతో మంది యువకులను, వ్యాపారవేత్తలను మోసం చేసిన ఓ కిలాడీ లేడీని పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలను విడుదల చేశారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆ యువతి.. తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పలువురిని ఈ విధంగా మోసం చేసింది. ఇప్పుడు ఆమె తన మకాంను బెంగళూరుకు మార్చినట్లు తెలిసింది.

    చెన్నైకి చెందిన కిలేడీ లేడీ ప్రియదర్శిని మోసాలు గమనించినట్లయితే.. వరంగల్‌లో ఓ ప్రముఖుడి కుమారుడిని కేవలం ఐదు రోజుల్లో ప్రేమ పేరిట ముగ్గులోకి దింపి, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత డబ్బు, ఆభరణాలతో ఉడాయించింది. ప్రియదర్శినికి స్నేహ అనే మరో పేరు కూడా ఉంది.వరుస మోసా లనేపథ్యంలో ప్రియదర్శిని గురించిన మరిన్ని వివరాలను, ఆమె ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఆమె బెంగళూరు పారిపోయిందని సమాచారం అందిందని అన్నారు.

    ఓ యువకుడికి డాక్టర్‌గా పరిచయం చేసుకుని రూ. 5 లక్షలను, అతని స్నేహితుల నుంచి రూ. 10 లక్షలను ఆమె దొంగిలించిందని చెప్పారు. అంతేగాక, వరంగల్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా షోరూములో రూ. 75 లక్షలకు చెక్కులిచ్చి నాలుగు కార్లు కొనుగోలు చేయగా, అవి బౌన్స్ అయ్యాయని వెల్లడించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా