By: Oneindia Telugu Video Team
Published : November 02, 2017, 11:23

పద్మశ్రీకి కిదాంబి శ్రీకాంత్‌ పేరు

Subscribe to Oneindia Telugu

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ కు అరుదైన గౌరవం దక్కనుంది. కిదాంబి శ్రీకాంత్‌ పేరుని పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేశారు, మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయెల్. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి బుధవారం ఆయన లేఖ రాశారు. ఇటీవల డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో విజేతగా నిలిచిన శ్రీకాంత్ ఒక ఏడాదిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ఆయన ప్రతిపాదన చేశారు.
పద్మ అవార్డు నామినేషన్స్ గడువు సెప్టెంబరు 15నే ముగిసినప్పటికీ... పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో విజయ్ గోయల్ తాజాగా ఈ లేఖ రాశారు. 'భారతదేశ యువతకి శ్రీకాంత్ ఐకాన్‌గా నిలిచాడు. తన విజయాలతో లక్షలాది మంది‌‌‌లో అతను స్ఫూర్తి నింపుతున్నాడు' అని అందులో పేర్కొన్నారు. 'మాజీ క్రీడల మంత్రినైన నన్ను.. చాలా మంది కిదాంబి శ్రీకాంత్‌ పేరుని ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు కోసం సిఫార్సు చేయాల్సిందిగా కోరారు. ఆ స్ఫూర్తి వారిలో కనిపించింది. అందుకే నేను కిదాంబి శ్రీకాంత్ పేరుని సిఫారసు చేస్తూ లేఖ రాశాను' అని విజయ్ గోయల్ వివరించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా