By : Oneindia Telugu Video Team
Published : October 31, 2017, 07:05
02:13
కిమ్ రాజభోగాలు తెలిస్తే షాకే ! కిమ్ ని లొంగదీయాలంటే అదే మార్గం
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు లోకానికి పెద్దగా తెలియవు. ఎప్పుడూ ఆయుధాలతో సహవాసం చేసే కిమ్, ఆయన భార్య రీ సోల్ జూల లగ్జరీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కిమ్ జాంగ్ ఉన్ అసలేం చదువుకున్నారు? ఆయన ఆసక్తుల గురించి కూడా ఎవరికీ తెలియదు. ఓ స్విస్ స్కూల్లో కిమ్ విద్యను అభ్యసించారని చెబుతుంటారు. కిమ్ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీకోసం...
కిమ్ జాంగ్ ఉన్ కుటుంబానికి ఉత్తరకొరియా మొత్తం మీద 17 ప్యాలెస్లు ఉన్నాయి. సొంతగా ఓ ఐలాండ్ కూడా ఉంది. ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన, 200 అడుగులు పొడవు ఉండే పడవ కిమ్ సొంతం. సినిమాలు వీక్షించేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్ ఉంది. 100కు పైగా కార్లు రోజూ కిమ్ సైగ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎలాంటి దాడి జరిగినా ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా కిమ్ కోసం ప్రత్యేకంగా మెర్సిడెజ్ కారును తయారు చేయించారు