By : Oneindia Telugu Video Team
Published : January 13, 2018, 04:46

సంక్రాంతి సంబరాలలో కోడి పందాలు


కోడిపందెం అనేది ప్రతీ యేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. కోడి పందాల కు ఉన్న క్రేజే వేరు. అయితే సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పందేల జోరు మాములుగా ఉండదు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పెందేల జోరు జూదరుల పాలిట స్వర్గంగా మారింది. పోలీసు ప్రకటనలు తేలిపోయి, మరోసారి పందెగాళ్లదే పైచేయి అయ్యేలా ఉంది. సంప్రదాయం పేరుతో నిర్వహించే కోడిపందాలు ఈసారి మరింత జోరుగా సాగుతాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది.
కానీ ఇప్పుడు మాత్రం కోడి పందాలు అంటే మొదట గుర్తొచ్చేది ఉభయగోదావరి జిల్లాలే.
మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు. కానీ ఎక్కడిక్కడ ఇవి జరిగిపోతూనే ఉంటాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా