By: Oneindia Telugu Video Team
Published : November 06, 2017, 02:43

ధోని గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పిన కోహ్లీ

Subscribe to Oneindia Telugu

మాజీ కెప్టెన్ ధోనికి, నాకు మధ్య విభేదాలంటూ ఎవరైనా మాట్లాడితే నవ్వుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ధోనితో తమ అనుబంధం ఎంతో దృఢమైందని.. ఎవరేం మాట్లాడినా.. ఏం రాసినా తమ బంధాన్ని ప్రభావితం చేయలేరని కోహ్లీ స్పష్టం చేశాడు. తన 29వ పుట్టినరోజు సందర్భంగా 'బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' వెబ్‌ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 'ధోనికి, నాకు మధ్య విభేదాలున్నట్లుగా చాలామంది కథలు అల్లుతుంటారు. మేమిద్దరం చేసే ఉత్తమమైన పనేంటంటే.. వాటిని చదవం. తిరిగి మేం అన్యోనంగా కనిపించేసరికి ఆశ్చర్యపోతుంటారు. ఏళ్లు గడిచేకొదద్దీ మా బంధం మరింత బలపడుతూ వచ్చింది' అని కోహ్లీ చెప్పాడు.
'ధోనిలా క్రికెట్‌ నాలెడ్జి ఉన్న మరొకరిని నేను చూడలేదు. ఆటలో ఏం జరుగుతోందో అంచనా వేయడంలో అయినా.. పరిస్థితులకు తగ్గట్లు ఏం చేయాలనే విషయంలో అయినా ధోనిని మించిన మేధావిని నా కెరీర్లో చూడలేదు. నేను నా ఆలోచనలకు తగ్గట్లే నిర్ణయాలు తీసుకుంటా కానీ.. అవసరమైనపుడు ధోని సలహా తీసుకుంటాను. నేను పది సార్లు నా ఆలోచనలు పంచుకుంటే దాదాపు ఎనిమిది సార్లు అవి పనిచేస్తాయని చెప్తారు. కాలం గడిచే కొద్దీ మా మధ్య స్నేహం మరింత దృఢమైంది' అని కోహ్లీ అన్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా