By : Oneindia Telugu Video Team
Published : November 08, 2017, 05:31

మీ టార్గెట్ ధోని నే నా మరి పాండ్యా ?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో ధోని బ్యాటింగ్‌లో దూకుడు తగ్గడంతో టీ20ల నుంచి ధోని తప్పుకుని, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్‌లు సూచించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సునీల్ గవాస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌‌లు ధోనికి మద్దతుగా నిలవగా.... తాజాగా కెప్టెన్ కోహ్లీ కూడా ధోనికే మద్దతుగా నిలవడం విశేషం. మంగళవారం తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడాడు. 'ధోనిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు అర్థం కావడంలేదు. ఒక బ్యాట్స్‌మెన్‌గా నేను మూడు సార్లు విఫలమైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే నా వయసు 35 సంవత్సరాలు కాదు కాబట్టి' అని కోహ్లీ తెలిపాడు.'ధోని ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్‌పై నిర్వహించిన అన్ని టెస్టుల్లో పాసవుతున్నాడు. మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు.అని ధోనికి మద్దతుగా కోహ్లీ నిలిచాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా