By : Oneindia Telugu Video Team
Published : June 09, 2018, 12:44

మీ అన్న నుంచి నేర్చుకో ..పవన్ కు కోట హితువు


తనకు జ్వరంగా ఉన్నా జనాల కోసమే గ్రామాల్లో తిరుగుతున్నానని, ముసుగుతన్ని పడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు సినిమా రంగంలో ఆదాయం బాగుందని, ఇటీవలే రూ.25 కోట్లు ఆదాయపు పన్ను కట్టానని చెప్పారు. కానీ దానిని కాదని ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. యలమంచిలిలో ఇంతమంది జనం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. జనసేన పోరాటయాత్ర జిల్లాలోని పాయకరావుపేట, అచ్యుతాపురం మండలం పూడిమడక, యలమంచిలి పట్టణాల్లో పర్యటించారు. పవన్ మాట్లాడుతూ.. యలమంచిలి ఎమ్మెల్యే రమేష్ బాబు అక్రమ మైనింగ్‌ చేస్తూ రోజుకి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు ఆదాయంపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలు పరిష్కరించడంపై కనిపించడం లేదన్నారు.
కాగా, యలమంచిలిలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం ప్రారంభించగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆయన ప్రసంగం ముగిశాక సరఫరా పునరుద్ధరించారు. దీనిపై జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ పర్యటన సందర్భంగా ఎలమంచిలి పట్టణంలో అన్నివీధులు జనంతో కిక్కిరిసిపోయాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ నుంచి అనుభవాలు నేర్చుకోవాలని ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై స్పందించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more