By : Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:25

నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కోట్ల ధర్నా

సమాన్య ప్రజలపై బిజేపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియన్ నేత కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎదుర్కుంటన్న సమస్యల పరిష్కారం కోసం కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్న చేపట్టారు. ఈ దర్నాలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల మీడియాతో మాట్లాడుతూ..పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల బ్లాక్ మానీని తీసుకొస్తామని చెప్పిన నరేంద్ర మోదీ.. బ్లాక్ మనీ లెక్కలు చెప్పడంలేదని బిజేపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ధనవంతుల వివాహా వేడుకలకు కోట్ల రూపాయాలు ఎలా వస్తున్నాయో బయట పెట్టాలని, వాటి లెక్కలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించడంలో విఫలంమైయిందని ఆయన విమర్శించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా