వికెట్ల వెనుక తెలుగు పవర్ !
Published : November 29, 2021, 03:10
టీమిండియా యువ వికెట్ కీపర్, తెలుగు తేజం కేఎస్ భరత్పై దిగ్గజ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నమ్మకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ నిలబెట్టుకున్నాడని తెలిపాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కకపోయినా.. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆఖరి నిమిషంలో మెడనొప్పితో బాధపడుతున్న వృద్దిమాన్ సాహా స్థానంలో వికెట్ కీపింగ్ చేసిన భరత్.. వికెట్ల వెనుక అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.