By: Oneindia Telugu Video Team
Published : November 25, 2017, 04:54

'మెట్రో'పై కేటీఆర్, ఇవీ డిటైల్స్ !

Subscribe to Oneindia Telugu

రాజధాని ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో ప్రయాణానికి సర్వం సిద్దమైంది. ఈ నెల 28న మధ్యాహ్నాం 2.15గం.కు ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, నాయకులు శనివారం ఉదయం మెట్రోలో ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు. మంత్రులు కేటీఆర్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు మెట్రో రైలులో ప్రయాణించారు.మెట్రోలో ప్రయాణం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
మెట్రో ప్రారంభం రోజున మియాపూర్ మెట్రో ప్రాంతంలోనే ఒక బహిరంగ సభకు ప్లాన్ చేశామని, అయితే అదేరోజు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ఉన్నందువల్ల.. సమయాభావం కారణంతో దాన్ని రద్దు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో ప్రారంభం తర్వాత నేరుగా సదస్సు వెళ్లాల్సి వస్తుండటంతో.. ఆరోజు ప్రధాని గానీ, సీఎం గానీ మాట్లాడే అవకాశాలు లేవన్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రో వివరాలు వెల్లడించేందుకు ఈరోజు మీడియా ముందుకు వచ్చినట్టు తెలిపారు.
మీడియా సమావేశం సందర్భంగా మెట్రో‘టీ సవారీ' స్మార్ట్ కార్డును మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్డు ద్వారా 16రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పెట్రోల్, బ్యాంకింగ్, ఆర్టీసీ, ఇలా ఇతరత్రా రంగాల్లో ఈ కార్డు ద్వారా సేవలు పొందవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా