By : Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:11

ఎస్పీ పాటల సిడీని ఆవిష్కరించిన హీరో ధనుష్

ఎప్పుడూ.. వినూత్నంగా..సమాజం కోసం ఆలోచించే..కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ.. ఆయనే స్వయంగా రాసిన ఆడపిల్ల అనే.. సీడీని ధనుష్ తో ఆవిష్కరించుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే..కర్నూలు జిల్లా.. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం సమీపంలో తన తాజా చిత్రం ‘పవర్ పాండి' షూటింగ్ లో రజనీకాంత్ అల్లుడు..ధనుష్ పాల్గొని సందడి చేశాడు.. ఈ విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అక్కడకు వెళ్లారు. తాను రాసిన 'ఆడపిల్ల' పాటల సీడీని ఆవిష్కరించాలని ధనుష్ ను కోరారు. దీంతో చాలా ఆనందానికి గురైన ధనుష్... పాటల సీడీని ఆవిష్కరించాడు. అనంతరం ఆ పాటలను విని... వాటికి అర్థమేంటో అడిగి తెలుసుకున్నాడు. పాటలు ఎంతో బాగున్నాయంటూ ఎస్పీని అభినందించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా