By: Oneindia Telugu Video Team
Published : February 07, 2018, 01:14

రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్

Subscribe to Oneindia Telugu

పార్లమెంటు ఉభయ సభలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి. ఏపీకి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోకసభలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్ద సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.
ఏపీకి న్యాయం చేయాలని పట్టుబట్టారు. వారు సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు. అయితే కాసేపట్లే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని, దానికి అడ్డుపడవద్దని కేంద్రమంత్రులు కోరారు. దానికి టీడీపీ ఎంపీలు ససేమీరా అన్నారు.
ఏపీ ఎంపీలు తమ ఆందోళనలు సభలో కొనసాగించారు. ఏదైనా ఉంటే తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెప్పాలని అన్నారు. దీంతో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, నిరసనలు తాత్కాలికంగా ఆపేయాలని కోరారు
రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రజల ఇబ్బందులను తాము ఆయనకు వివరించామని చెప్పారు. టీడీపీ డ్రామాలు అతనికి చెప్పామన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు బుధవారం రాజ్యసభ నుంచి ఒక్కరోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కేవీపీ పదేపదే నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. సభకు అడ్డుపడుతున్నారని చెబుతూ కేవీపీని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా