By : Oneindia Telugu Video Team
Published : June 14, 2017, 03:38

లండన్ లో గ్రీన్‌ఫెల్ టవర్‌ ఎలా కాలిపోతుందో చూడండి

ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లండన్ లోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా పేరొందిన గ్రీన్ ఫెల్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లండన్, వెస్ట్‌ ఎస్టేట్‌ లోని 27 అంతస్తుల గ్రెన్‌ ఫెల్‌ టవర్‌ మొత్తం అగ్నికి ఆహుతికాగా, ఈ భవంతి ఎప్పుడైనా కూలిపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎగసి పడుతున్న మంటలు అదుపులోకి రాకపోగా, పక్కనున్న భవనాలకు కూడా వ్యాపించాయి. గత అర్థరాత్రి 1.16 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగగా, 1974లో నిర్మించిన టవర్ లోని 120 ఫ్లాట్‌ లన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో అత్యధికులు నిద్రిస్తుండటంతో, మృతుల సంఖ్య వందల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా