By : Oneindia Telugu Video Team
Published : January 03, 2018, 12:24

2018లో మీ భార్య, గర్ల్ ఫ్రెండ్.. మీతో ఇలా మెలుగుతారు..


మీ రాశి ప్రకారం 2018లో మీరు మీ జీవిత భాగస్వామి(భార్య లేదా భర్త) తో లేదా మీ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఉంటారనే విషయాలను తెలుసుకోవొచ్చు. మీ భార్యతో 2017లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ మీ ప్రేమను అంగీకరించకపోయి ఉండొచ్చు. 2018లో కూడా ఇలాంటి ఇబ్బందులనే మీరు అనుభవించనున్నారా లేదంటే మీరు కోరుకున్న అమ్మాయితో ఆనందంగా ఉండనున్నారా అనే విషయాల్ని తెలుసుకోండి.
మేషం 2018లో మీరు మీ జీవిత భాగస్వామి(భార్య లేదా భర్త) తో మీరు ఆనందంగా ఉంటారు. ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ తో 2018లో సంతోషంగా ఉంటారు. అయితే అప్పుడప్పడు మీ పార్టనర్ తో చిన్నచిన్న సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ విషయంలో మీరు తొందరపడి మాట జారకండి. ఎలాంటి తగదాలు పెట్టుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో చిన్నగా మొదలయ్యే గొడవలే తర్వాత పెద్దగా మారే అవకాశం ఉంది.
వృషభం 2018 మీకు చాలా సంతోషాలు తీసుకురానుంది. మీరు మీ భాగస్వామిని ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత మంచిది. అయితే 2018 ప్రారంభంలో మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవొచ్చు. తర్వాత మీ సంసారపరంగా ఎలాంటి ఇబ్బందులుండవు. అలాగే పెళ్లికాని వారు గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.
మిథునం 2018లో మీ భార్య మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఆమెతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక పెళ్లి కానీ వారికి వారు కోరుకున్న అమ్మాయితో పెళ్లి అయ్యే అవకాశం ఉంది. మీరు 2017లో మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యతో కాస్త ఇబ్బందులుపడి ఉండొచ్చు. కానీ 2018 మాత్రం మీరు సంతోషంగా ఉంటారు.
కర్కాటకం 2017లో మీరు మీ భాగస్వామితో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో మాత్రం మొత్తం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీకు నచ్చినట్లుగానే మీ జీవిత భాగస్వామి వ్యవహరిస్తుంది. అంతేకాదు మీ భార్య మీరు కోరుకుంటున్న చాలా కోరికల్ని త్వరలో నెరవేర్చనుంది.
సింహరాశి 2018లో మీ ప్రేమ విజయవంతం కానుంది. మీరు ఎన్నో రోజులుగా ప్రేమించిన అమ్మాయి మీ ప్రేమను అంగీకరిస్తుంది. ఇక గర్ల్ ఫ్రెండ్ లేని వారికి చాలా మంది అమ్మాయిలు పరిచయం అవుతారు. అందులో తమ జీవితభాగస్వామిగా ఎవరినీ సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో మీరు కాస్త ఇబ్బందిపడతారు. వివాహం చేసుకున్న వారు భార్యతో ఆనందంగా ఉంటారు.
కన్య 2018 మీ వైవాహిక జీవితం అంత బాగుండదు. మీకు కొన్ని కష్టాలు వస్తాయి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి కొన్ని విషయాల్లో మీతో వాదించవచ్చు. దీంతో మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అయితే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తే మాత్రం ఎలాంటి సమస్యలుండవు.
తుల 2018 మీకు చాలా అదృష్టాలను తీసుకొస్తుంది. మీరు ఇష్టపడే అమ్మాయితోనే మీ వివాహం త్వరలో జరుగుతుంది. ఒకవేళ అమ్మాయి కోసం వెతుకుతున్నట్లయితే మీరు అర్థం చేసుకునే మంచి అమ్మాయి మీకు దొరుకుతుంది. 2018 మొత్తం మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
వృశ్చికం పెళ్లికాని వారు 2018లో చాలా ఆనందంగా ఉంటారు. మీరు కోరుకున్న అమ్మాయి మీకు దక్కుతుంది. 2018లో ప్రతి క్షణం మీ లవర్ తో హ్యాపీగా గడుపుతారు. అయితే మీరు ఒక్కోసారి హద్దులు దాటే క్షణాలు కూడా వస్తాయి. ఆ టైంలో కంట్రోల్ లో ఉండండి. ఇక పెళ్లయిన వారు వారి భాగస్వామి తో ఆనందంగా ఉంటారు.
ధనుస్సు 2018లో మీ భార్య మీకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. మీరు చెప్పినట్లుగా వింటుంది. మీకు సంసారపరంగా ఎలాంటి ఇబ్బందులుండవు. ఒకవేళ మీకు పెళ్లికానట్లయితే మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి మీకు త్వరలో భార్యగా రానుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more