By : Oneindia Telugu Video Team
Published : November 18, 2017, 02:19

ట్యాంక్ బండ్‌పై ఇక అది ఉండదు ?


ట్యాంక్ బండ్‌పై స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన 'లవ్ హైదరాబాద్' ఇకపై అక్కడ కనిపించదు. ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆ సింబల్‌ను పీపుల్స్ ప్లాజాకు తరలించారు అధికారులు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు లవ్ హైదరాబాద్ సింబల్ ను తరలించినట్టు తెలుస్తోంది. ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్దకు ఈ సింబల్‌ను హెచ్‌ఎండీఏ అధికారులు తరలించారు.
లవ్ హైదరాబాద్ సింబల్ ఇన్నాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. ట్యాంక్ బండ్ వచ్చే ప్రతీ ఒక్కరు దాని వద్ద సెల్ఫీ దిగి వెళ్లేవారు. నవంబర్ 25వ తేదీ 2016న మంత్రి కేటీఆర్ దీన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు.
లవ్ హైదరాబాద్ స్పాట్ ఐకానిక్ సింబల్ గా మారుతుందని గతంలో కేటీఆర్ చెప్పినట్టే.. చాలామందికి ఇదొక సెల్ఫీ స్పాట్ గా మారింది. అయితే చాలా జంటలు దీనిపై పేర్లు రాసుకుని మరీ సెల్ఫీలు దిగుతున్నాయి. దాంతో 'లవ్ హైదరాబాద్' కళ తప్పింది. రంగు కాస్త వెలిసినట్టయింది. లవ్ హైదరాబాద్ సింబల్ పై పేర్లు రాస్తుండటంతో.. ఆ అక్షరాలు కనిపించకుండా ఉండేందుకు రంగులు వేయాల్సి వస్తోంది. మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతుండటంతో.. ఇక ఈ సింబల్ ను ఇక్కడినుంచి తరలించడమే బెటర్ అని హెచ్ఎండీఏ అధికారులు భావించినట్టు సమాచారం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా